అనాథను అక్కున చేర్చుకున్న అన్నపూర్ణ సేవా సంస్థ | Sakshi
Sakshi News home page

అనాథను అక్కున చేర్చుకున్న అన్నపూర్ణ సేవా సంస్థ

Published Sun, Jul 23 2023 2:44 AM

- - Sakshi

నల్గొండ: మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో వారం రోజులుగా రోడ్డు వెంట ఉండి యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్థానికులు ఆరా తీయగా ఆమెది మధ్యప్రదేశ్‌ అని, తన కుటుంబ సభ్యులు కొట్టడంతో పారిపోయి ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది.

జడ్చర్ల– కోదాడ ప్రధాన రహదారిపై వీధి లైట్ల కింద నాలుగు రోజులుగా వర్షానికి తడుస్తూ ఉంటుండంతో స్థానికులు ఆమె ధీనస్థితిని వీడియో తీసి ‘ఈ అనాథకు దిక్కెవరు’ అని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. స్పందించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సేవా భారతి సభ్యుడు రాము ఆమెకు శనివారం అల్పాహారం అందించి నల్లగొండలోని సేవా భారతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు భీమనపల్లి శ్రీకాంత్‌కు సమాచారం అందించాడు.

ఆయన అంబులెన్స్‌లో నేరేడుచర్లకు వచ్చి సేవా భారతి సభ్యులు, స్థానిక పోలీసులు, మున్సిపల్‌ శాఖ సిబ్బంది సహకారంతో మతిస్థిమితం కోల్పోయిన మహిళళను సూర్యాపేట సమీపంలో గల దురాజ్‌పల్లిలోని అన్నపూర్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. కార్యక్రమంలో సేవా భారతి సభ్యులు మెట్టు వేణుగోపాల్‌రెడ్డి, చామకూరి వీరయ్య, సంపత్‌, రాములు, రాము, నాగిరెడ్డి, సైదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, స్థానికులు వెంకన్న, శంకర్‌రెడ్డి, కోటేశ్వర్‌రావు, వెంకటకృష్ణ తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement