సోంపేట: మండలంలోని జింకిభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు (32) బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జింకిబద్ర గ్రామానికి చెందిన అంబటి విశ్వనాథం, అప్పలనరసమ్మ తృతీయ పుత్రుడు జానకిరావు. మూడేళ్ల కిందటే వివాహమైంది. సంతానం లేదు. గత ఎనిమిదేళ్లుగా యాదాద్రిలో వలస కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలం పనులు లేక పోవడంతో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. యాదాద్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. జానకిరావు మృతితో జింకిభద్ర గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. జానకిరావు అన్నయ్య సోమేశ్వరరావు సుమారు 15 ఏళ్ల కిందట సోంపేట–జింకిభద్ర రహదారిలో బస్సు ప్రమాదంలో మృతి చెందాడు.


