ఈఎస్‌ఆర్ అప్‌డేట్‌తో ఉద్యోగ ఉపాధ్యాయులకు తలనొప్పులు
రోజుకో కొత్త నిబంధనతో తీవ్ర ఒత్తిడి
బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నామని ఆవేదన
శ్రీకాకుళం:
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసుకోవాలని ఆదేశా లు జారీ చేయడం వారికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. రోజుకో కొత్త పని అప్పజెబుతుండ డంతో బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నామని, యాప్‌లతోనే సమయం సరిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ–ఎస్‌ఆర్ ప్రక్రియలో తొలుత నిధి లాగిన్‌లో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సర్వీసు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా జీవిత భాగస్వామి వివరాలు నమోదు చేసి ఈ కేవైసీ ద్వారా నిర్ధారించుకుంటేనే మిగిలిన వివరాలు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. డీడీఓకు ఆ వివరాలను ఓటీపీ ద్వారా ధ్రువీక రించాలి. డీడీఓ కన్ఫర్మేషన్ పూర్తి చేస్తేనే కుటుంబ సభ్యుల వివరాలు వ్యక్తిగత సర్వీసు వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఉద్యోగు లు అంటున్నారు. ఇది కొంత మంది ఉద్యోగ ఉపా ధ్యాయులకు ఇబ్బంది కలిగించే అంశమని చెబుతు న్నారు. జీవిత భాగస్వామితో విడాకులు తీసుకు న్నా, మరే కారణాలతో అయినా దూరంగా ఉన్నా ఈ వివరాలు నమోదు చేయడం కష్టతరం. అలాగే జీవిత భాగస్వామి మృతి చెందితే కూడా కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగితోపాటు డీడీఓ కూడా పని భారం అనే చెప్పాలి.
వివాహ వివరాలు నమోదు చేయడం కష్టమే
ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు తన వివాహానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది నమోదు చేయడం కష్టం కాకపోయినప్పటికీ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫోటోలు, మరికొన్ని ఆధారాలను పొందుపరచాల ని ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయా వర్గాలు తప్పుపడుతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో చాలామంది 30, 40 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లి ఫొటోలు ఏ విధంగా తీసుకురాగలుగుతారని ఉద్యోగ ఉపాధ్యాయు లు ప్రశ్నిస్తున్నారు. అలాగే వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా అడుగుతున్నారని కొందరు చెబుతుండగా, గతంలో వివాహ రిజిస్ట్రేషన్ ను ఏ ఒక్కరూ చేయించుకునేవారు కాదు. ఇటీవల కాలంలోనే రిజిస్ట్రేషన్ పై పలువురు శ్రద్ధ చూపిస్తున్నారు. అలాంటిది ఎప్పుడో వివాహమైన వారిని ఇలాంటి ఆధారాలను పొందుపర్చాలని కోరడాన్ని తప్పుపడుతున్నారు.
ఇందులో కూడా విడాకులు తీసుకున్న వారు వితంతువులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, దీనిపై ఏం చేయాలో కూడా అర్థం కాక మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఎస్ ఆర్ విధానాన్ని తీసుకువచ్చారని అప్పట్లోనే తామంతా ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ కొత్త కొత్త నిబంధనలను తెచ్చి దాన్ని అప్‌డేట్ చేసుకోవాలని చెప్పడం సరైన విధానం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.


