నరసన్నపేట: స్థానిక వంశధార డివిజన్ పరిధిలోని భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే కిళ్లాం చానెల్‌కు ఆనుకొని నరసన్నపేట ఇందిరానగ ర్ ప్రాంతంలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా భవనా లు నిర్మించారు.
ఇప్పుడు తాజాగా నరసన్నపేట బ్రాంచి కెనాల్‌కు ఆనుకొని జమ్ము కూడలి వద్ద ఉన్న విలువపైన భూమి కబ్జాకు స్థానికులు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో లక్షలాది రూపాయల విలువ కలిగిన ఈ స్థలం కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. లారీ అసోసియేషన్ పేరున ఈ స్థలం కాజేయడానికి కుట్రలు చేస్తున్నారు. గురువారం ఈ స్థలంలో జేసీబీతో మట్టి నెరిపారు. ఇలా వదిలేస్తే ఈ స్థలం ఆక్రమణ అవుతుందని స్థానికులు అంటున్నారు. వంశధార అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విలువైన ఈ స్థలం ఆక్రమణలు కాకుండా చూడాలన్నారు. దీనిపై వంశధార ఈఈ మురళీ మోహనరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌కు లెటర్ రాస్తామని తెలిపారు.


