ఏలూరు డిపో మేనేజర్‌నంటూ హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

ఏలూరు డిపో మేనేజర్‌నంటూ హల్‌చల్‌

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

ఏలూరు డిపో మేనేజర్‌నంటూ హల్‌చల్‌ ఏపీ సీపీఎస్‌ ఈఏ నూతన అధ్యక్షుడిగా వీవీ రాజు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు గురువారం హల్‌చల్‌ చేశా డు. తాను ఏలూరు డిపో మేనేజర్‌నని, కొత్తూరు వెళ్లేందుకు సీటు ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బందికి హుకుం జారీ చేశాడు. ఉన్నది కాసేపైనా అక్కడి సిబ్బందిని ఓ అధికారి మాదిరిగానే హడలెత్తించాడు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కాంప్లెక్స్‌లోకి ఓ యువకుడు సూటూ బూటా వేసుకుని వచ్చాడు. కొత్తూరుకు వెళ్లడానికి సీటు కావాలని నానా హంగామా చేశాడు. అతడి హడావుడి చూసి అనుమా నం వచ్చిన వెంటనే స్టేషన్‌ మాస్టర్‌ ప్రసాదరావు, డిపో మేనేజర్‌ పినకాన సంతోష్‌లకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చీ రావడంతోనే యువకుడిని ఏ బ్యాచ్‌కు చెందినవాడివని ప్రశ్నించగా.. 2019 బ్యాచ్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ అయ్యానని చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. అసలు 2019లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ జరగలేదని, బ్యాచే లేదని గ్రహించి యువకుడిని ఐడీ కార్డు చూపించమన్నారు. తనతో తెచ్చుకున్న సూట్‌కేస్‌ కాసేపు తెరుస్తున్నట్లు నటిస్తూనే అధికారుల ప్రశ్నల వర్షాని కి తడబడిపోయాడు. దీంతో చేసేదేమీ లేక ‘సార్‌ తప్పయిపోయింది.. నాపేరు వారాడ సుధీర్‌, విశా ఖ చిన్నవాల్టేరులో నివాసముంటున్నాను, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్‌ చేస్తున్నాను. బస్‌లు ఇరు కుగా ఉండటంతో ఇలా చేశాను..’ అంటూనే సూట్‌కేసు పట్టుకుని క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించేశాడు. దీంతో డిపోమేనేజర్‌ సంతోష్‌, స్టేషన్‌ మాస్టర్‌ ప్రసాదరావులు రెండో పట్టణ పీఎస్‌ను ఆశ్రయించారు. స్టేషన్‌ మాస్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు అన్నారు.

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రదే శ్‌ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుని గా వీవీ రాజును నియ మించినట్లుగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్‌, సీఎం.దాసు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఎస్‌ రద్దయ్యే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని, సెప్టెంబర్‌ 1 చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని రాజు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement