‘కాన రాని దూరంలో’ పాట విడుదల | - | Sakshi
Sakshi News home page

‘కాన రాని దూరంలో’ పాట విడుదల

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

‘కాన రాని దూరంలో’ పాట విడుదల

శ్రీకాకుళం అర్బన్‌: ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు’ పేరు తో నిర్మించిన సిక్కోలు చిత్రాన్ని ఆదరించాలని ఆ చిత్ర యూనిట్‌ బృందం కోరింది. శ్రీకాకుళంలోని కార్గిల్‌ పార్క్‌ వద్ద ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు‘ చిత్ర బృందం వారి మొదట పాటను లిరికల్‌ రూపంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ బృందం మాట్లాడుతూ కొన్ని పేజీ ల జ్ఞాపకాలు చిత్రాన్ని, పెద్ద సినిమాలకు దీటుగా నిర్మించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేమ్‌ సుప్రీం యూట్యూబ్‌ చానెల్‌లో పూర్తి పాటను అందించామన్నారు. ‘కాన రాని దూరంలో’ అనే ఈ పాటలో సాహిత్యం, సంగీతం శ్రోతల్ని అలరిస్తోంద ని తెలిపారు. చిరంజీవి మజ్జి రాసిన పాటను ప్రము ఖ సంగీత గురువు వరద దుర్గరాజు మాస్టారు, హీరో మిధున్‌, తల్లిదండ్రులు సంయుక్తంగా లాంచ్‌ చేశారు. పూర్తిగా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గొప్ప విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ పాటకు రచన చిరంజీవి మజ్జి, సంగీతం నిజానీ అంజన్‌, వయోలి న్‌ హేమంత్‌ కశ్యప్‌, గానం హితేష్‌ సాయి, దర్శకు లు ప్రేమ్‌ సుప్రీం అని తెలిపారు. అనంతరం నటు లు బాబూరావు, రమేశ్‌ నారాయణ్‌, సాయి సుధాక ర్‌, తదితరులు చిత్ర విశేషాలను, కాన రాని దూరంలో పాట ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియజేసారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement