వజ్రపుకొత్తూరు రూరల్: విద్యాశాఖ నిర్వహిస్తున్న స్పెషల్ టెట్‌లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు వినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్‌కుమార్ కోరారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ జాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయు లు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతుంటే ప్రభుత్వం కోర్టు తీర్పుల పేరుతో సాకులు చెబుతోందని అన్నారు. ఒక వైపు విద్యార్థులు పాఠాలను బోధించాలని, మరో వైపు శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు ఇతర బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సతమతం అవుతున్నార ని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల కు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలని లేనిపక్షంలో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, చలో విజ యవాడ కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎల్.బాబురావు,గుంటు కోదండరావు, బల్ల చిట్టిబాబు, ఎల్‌వీ చలం, టి.జయరాం, కంచరాన జయరాం తదితరులు ఉన్నారు.


