బంధువుల వివాహానికి వచ్చి విగతజీవిగా.. | - | Sakshi
Sakshi News home page

బంధువుల వివాహానికి వచ్చి విగతజీవిగా..

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

జమ్ము కాలువలో విశాల్‌ మృతదేహం లభ్యం

నరసన్నపేట : ఖరగ్‌పూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న మెండ విశాల్‌కుమార్‌ (30) సారవకోట మండలం కేలవలస కల్యాణ మండపంలో జరిగిన వివాహనికి వచ్చి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. సోమవారం విశాల్‌కుమార్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సారవకోట మండలం కిన్నెరవాడ సమీపంలోని వంశధార కాలువలోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం నరసన్నపేట మండలం జమ్ము వద్ద వంశధార బ్రాంచి కెనాల్‌లో విశాల్‌ మృతదేహం కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, విశాల్‌కుమార్‌ ఖరగ్‌పూర్‌ నాలుగేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తూ బంధువుల అమ్మాయి వివాహానికి వచ్చి ఇలా విగత జీవిగా మారాడు. కుమారుడు అకస్మాత్తుగా మర ణించడంతో తల్లిదండ్రులు ప్రభాకర్‌, భాగ్యలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సారవకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement