కవిటి: ఉద్యాన పంటల్లో రైతులకు అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయం ఇచ్చే పంటగా ఆయిలపామ్ నిలుస్తుందని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ రీజనల్ రీసర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.మాధవిలత అన్నారు. కవిటి మండలంలోని మాణిక్యపురం, రాజపురం గ్రామాల్లో మంగళవారం పర్యటించి రైతులతో మాట్లాడారు. కవిటి మండలం ఆయిల్‌పామ్ సాగుకు అనువైనదా? కాదా అనే అంశాలతో కూడిన వాస్తవ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఆయిలపామ్ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయిస్తుందన్నారు. తుఫాన్లను సైతం మొక్కలు తట్టుకుంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యానశాఖాధికారి, సచివాలయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.
కంచిలి: ఉద్యాన పంటల్లో ఆయిల్‌పామ్ పంట సాగుపై ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు. జలంత్రకోట, కొల్లూరు పంచాయతీల పరిధిలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయల్‌పామ్ పంటపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ సహాయకులు ఎస్. లింగరాజు, బి.విద్యాసాగర్, పవన్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.


