టెక్కలి రూరల్ : చాకిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అండర్–18 ఉమెన్స్ రగ్బీ టోర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రగ్బీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. జిల్లా నుంచి 13 జట్లు పాల్గొన్నాయి. సిక్కోల్ జట్టు గెలుపొందగా, కేజీబీవీ సంతబొమ్మాళి జట్టు ద్వితీయ, జలుమూరు కేజీబీవీ జట్టు తృతీయ బహుమతులు సాధించాయి. ప్రధానోపాధ్యాయుడు కె.నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, జనరల్ సెక్రటరీ పొన్నాడ పార్వతీశం, కోశాధికారి కాపల రఘురాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాడన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం మైనారిటీ సంఘం కార్యవర్గ ఎన్నిక
శ్రీకాకుళం కల్చరల్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్ బాషా, జనరల్ సెక్రటరీగా ముజీబుర్ రెహమాన్ (ముజీబ్)లను ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలోని కంపోస్టు కాలనీ యాదవ భవనం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల అనుమతితో హాజీ అమీరుల్లా బేగ్ నియమించారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఆదిబ్ హసన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ ముబారక్, ఉపాధ్యక్షులుగా షేర్ అలీబేగ్, మహమ్మద్ అబ్దుల్ రజాక్, రెహమతుల్లా ఖాన్, రవుఫ్ ఖాన్, జిల్లా కార్యదర్శులుగా సుకుర్‌ఖాన్, మహమ్మద్ యాసీన్, షేక్ హుస్సేన్, షేక్ ఫిరోజుద్దీన్, కోశాధికారిగా సయ్యద్ రోషన్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మహమ్మద్ అబ్దుల్ ఉస్మాన్, మహమ్మద్ అబ్దుల్ హబీబుల్లా, షేక్ నిజాముద్దీన్, పబ్లిసిటీ సెక్రటరీగా షేక్ షాన్వాజ్, జాయింట్ సెక్రటరీగా సలీం ఖాన్, మీడియా అధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, కార్యదర్శిగా మహమ్మద్ అబ్దుల్ సత్తార్, ఈసీ మెంబర్లుగా షేక్ యూసుఫ్, జిలానిని నియమించారు.
మూలపేట నుంచి
భోగాపురం వరకు అభివృద్ధి
టెక్కలి: మూలపేట నుంచి భోగాపురం వరకు నాలుగ వరుసల రోడ్లతో అభివృద్ధి చేపడతామని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం సంతబొమ్మాళి మండలంలోని తీర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.650 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు. కోరమండల్ పరిశ్రమ ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. మేఘవరంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ముగిసిన ఎంపీ కప్ చెస్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ : ఎంపీ కప్–2026 చెస్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్‌లో రెండురోజులుగా నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా బాలబాలికలు హాజరయ్యారు. విజేతలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని సుజాత, వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఆరవల రవీంద్రబాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, బలగ ప్రహర్ష, దుంగ భాస్కర్, కొర్ను నాగార్జున ప్రతాప్, చెస్ సంఘ ప్రతినిధులు సనపల భీమారావు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఆరు గొర్రెలు మృతి
సోంపేట: గొల్లవూరులో మద్దిల మోహన్‌రావు, గజ్జి తేజేశ్వరరావులకు చెందిన ఆరు గొర్రెలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఆదివారం ఉదయం డొంకలూరు, బట్టిగళ్లూరు తీరంలో మంద మేపుతూ సాయంత్రం ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో హఠాత్తుగా కింద పడి మృతి చెందాయి. విషయం స్థానిక పశువైద్యాధికారి శిరీషకు తెలియజేయగా.. పంచనామా నిర్వహిస్తే విషయం తెలుస్తుందని తెలిపారు.


