కవిటి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు పిలుపునిచ్చారు. కొత్తపుట్టుగ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహాన్ రెడ్డి ఈ అంశంపై ఇదివరకే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోటీకి బలంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.పార్టీకోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. సమావేవంలో మండల కన్వీనర్ కడియాల ప్రకాష్, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు, దుర్గాసి ధర్మారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


