శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సబ్ జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపికలు ఈ నెల 23న జరగనున్నాయని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని పేర్కొన్నారు. బాలబాలికలు 2012 జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపిక చేసిన జిల్లా జట్లను సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు విజయనగరం జిల్లా బొబ్బిలి వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల చాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపించనున్నట్టు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఎంపికల్లో పాల్గొనాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు ఎం.వి.రమణ(9441011391)ను సంప్రదించాలని కోరారు.


