పట్టపగలే ఆటో చోరీ | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే ఆటో చోరీ

Aug 19 2026 12:30 AM | Updated on Aug 19 2026 12:30 AM

కొత్తూరు: ఇంటిముందు పార్కింగ్‌ చేసిన ఆటోను మంగళవారం పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుపోయిన ఘటన కొత్తూరు మండలం నివగాం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆలిబిల్లి నీల్‌కమల్‌ తన ఆటోను ఇంటి ముందు నిలుపుదల చేసి గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి ఆటో వద్దకు వచ్చి అందులోకి వెళ్లాడు. ఆటోను వెనుక నుంచి నెట్టాల్సింగా స్థానికులను కోరాడు. అక్కడున్న వ్యక్తులు ఆటో వెనుక నుంచి తొయడంతో ఒక్కసారిగా స్టార్ట్‌ అయ్యింది. దీంతో దుండగడు ఆటోను డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు ఆటో యూనియన్‌ నాయకుడు జి.నీలంనాయుడు తెలిపారు.

పది రోజుల్లో మూడు వాహనాలు..

కొత్తూరు మండలంలో వాహన చోరీలు పోలీసులకు సవాల్‌గా మారింది. పది రోజుల్లో మూడు వాహనాలు చోరికి గురయ్యాయి. ఈ నెల 5న మెట్టూరు–2 ఆర్‌ఆర్‌ కాలనీలో బిట్‌–3 ఆర్‌ఆర్‌ కాలనీ చెందిన మాజీ సర్పంచ్‌ కొయిలాపు శ్రీనివాసరావుకు చెందిన బైక్‌ చోరీకి గురైంది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహసింగి గ్రామంలో ఈ నెల 13న పి.తరుణ్‌ తన ఇంటి ముందు నిలుపుదల చేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుపోయారు. తాజాగా ఆటో చోరీకి గురికావడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పశువులు పట్టివేత

రణస్థలం: లావేరు మండలం రావివలస జంక్షన్‌ జాతీయ రహదారిపై శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న బొలెరో వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆరు పశువులను లావేరు పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాటిని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement