నందిగాం: మండలంలోని నౌగాం పంచాయతీ హుకుంపేటలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం సాయంత్రం గ్రామంలోని ఉపాధి వేతనదారులు పనికి వెళ్లిపోయాక.. గ్రామానికి చెందిన దాసరి సింహాచలం(37) తన ఇంటికి రెండిళ్ల దూరంలో ఉన్న మరొకరి ఇంటిలో గొంతులో తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నాడు. బంధువులు ఆయనను గమనించి 108లో టెక్కలి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందాడు. ఆయన మృతి చెందిన విధానంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం తన తల్లి సూరమ్మ, భార్య మణెమ్మతో కలిసి ఉంటున్నాడు. అయితే భార్యతో నిత్యం గొడవపడుతూ ఉండేవాడని సమాచారం. మృతికి గల కారణం పోలీసు దర్యాప్తు పూర్తయితేనే తెలుస్తుంది.


