శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)/శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం సమరశీల పోరాటాలను సాగించాల ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఇఫ్టూ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికై న జిల్లా కమిటీ సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగించాలని కోరారు. పోరాటాల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో పలు ప్రజా సంఘాల నాయకులు తాండ్ర ప్రకాష్, సన్నశెట్టి రాజశేఖర్, మామిడి క్రాంతి, జుత్తు వీరాస్వామి, సవలాపురపు కృష్ణవేణి పాల్గొన్నారు.
నూతన కార్యవర్గమిదే..
జిల్లా అధ్యక్షుడిగా మామిడి క్రాంతి, ఉపాధ్యక్షుడిగా జుత్తు వీరాస్వామి, ప్రధాన కార్యదర్శిగా సవలాపురపు కృష్ణవేణి, కార్యదర్శిగా దంత వెంకన్న, కోశాధికారిగా పోతనపల్లి మల్లేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా బర్ల గోపి, పి.ఆనందరావు, పి.షణ్ముఖరావు, కిర్రు దానేసు, కురమాన నాగమణి, ఎచ్చెర్ల పుణ్యవతిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


