● జిల్లాలో ప్రశాంతంగా సాగిన నీట్–2026 రీఎగ్జామ్
● వానతో ఇబ్బంది పడిన విద్యార్థులు
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్ యూజీ–2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. వర్షాల తో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. వర్షపు నీటిలోనే తడుచుకుంటూ లోపలికి ప్రవేశించారు. సుదూర ప్రాంతాల నుంచి నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక జిల్లాలో ముగ్గురు విద్యార్థులను పరీక్ష కేంద్రం లోపలకు అనుమతించకపోవడంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు.
2103 మందికి 183
మంది గైర్హాజరు..
జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్‌కు ఏర్పాటు చేసిన నాలు గు పరీక్ష కేంద్రాలకు మొత్తం 2103 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 1920 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 183 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు.
కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎప్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఎస్పీలు సీహెచ్ వివేకనంద, దాసరి లక్ష్మణరా వు, స్థానిక తహసీల్దార్ గణపతిరావు, శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో సుమారు 150 మంది వరకు పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతించారు.
పరీక్ష
నియమానుసారం కేంద్రానికి వస్తున్న ఓ విద్యార్థిని
సమయాభావం కావడంతో విద్యార్థినులకు గొడుగులు వేసి పరీక్ష కేంద్రం లోపలికి తీసుకువెళ్తున్న శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఈశ్వర్‌ప్రసాద్
ఎగ్జామ్‌కు వెళ్లే ముందు కుమార్తె చెవికి ఉన్న దిద్దులను తీస్తున్న తల్లి
పరీక్షా కేంద్రాలవారీగా హాజరు
పరీక్ష కేంద్రం పరీక్ష రాయాల్సిన హాజరైంది గైర్హాజరు
వారి సంఖ్య
ఆర్జీయూకేటీ 720 659 61
ఆర్ట్స్ కళాశాల 696 639 57
కేంద్రీయ విద్యాలయం 447 406 41
పాలిటెక్నిక్ కాలేజ్ 240 216 24
మొత్తం 2103 1920 183


