కూటమిపై వ్యతిరేకతతోనే పార్టీలో చేరికలు | - | Sakshi
Sakshi News home page

కూటమిపై వ్యతిరేకతతోనే పార్టీలో చేరికలు

Jun 22 2026 12:06 AM | Updated on Jun 22 2026 12:06 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బారువ గ్రామానికి చెందిన కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు

పార్టీలో చేరిన బారువ కొత్తూరుకు చెందిన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు

సోంపేట:

రాష్ట్రంలో కూటమి పాలనపై ఆ పార్టీ నాయకులకే విరక్తి వచ్చిందని, అందుకే వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మండలంలోని బారువ మేజర్‌ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ వైస్‌ ఎంపీపీ సానా రాజేష్‌ కన్నా ఆధ్వర్యంలో 70 కుటుంబాల వారు ఆదివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి ధర్మాన కృష్ణదాస్‌ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కృష్ణదాస్‌ మా ట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమిలోని పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు. సానా రాజేష్‌ కన్నాతో పాటు బారువ నుంచి సానా సోమేశ్వరరావు, సానా ముకుందరావు, కీలు తిరవయ్య, పొందర వల్లభరావు, బత్తిన పాపారావు, దుమ్ము దనరాజు, దున్న యాదవరావు, దున్న జగన్నాయకులు, తెలుకుల కృష్ణారావు, వనిమిన బాలరాజు, గురాల పురుషోత్తం, సాన ధర్మరాజు, యజ్జల వాసు, బెవర జగన్నాయకులు, పడాల సతీష్‌, కర్రి చిట్టెయ్య, టి.సురేష్‌, పి.కేశవరావు, కూ ర్మారావు, సోమయ్య, బీజేపీకి చెందిన కాళ్ల చంద్రయ్య తదితరులు చేరారు. బారువ కొత్తూరు గ్రా మం నుంచి టీడీపీకి చెందిన యర్ర బాపనమ్మ, గొరక హేమరాజు, తోట పురుషోత్తం, జనసేనకు చెందిన దంగ పాపారావు, సి.మోహనరావు, కర్రి కొర్లయ్య, డొంక సునీల్‌, బడే రాజేష్‌ , గొరక సోమయ్య తదితర కుటుంబాల వారు చేరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తురామారావు, పార్టీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌ రెడ్డి, పార్టీ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్‌, ఎంపీపీ డాక్టర్‌ నిమ్మన దాస్‌, జెడ్పీటీసీ తడక యశోద, కంచిలి ఎంపీపీ పైల దే వదాస్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు, పార్టీ నాయకులు శిలగాన భాస్కరరావు, తడక జోగారావు, గురాల శ్రీను,యర్ర రజని ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement