ఇచ్ఛాపురం.. ఇష్టానుసారం! | - | Sakshi
Sakshi News home page

ఇచ్ఛాపురం.. ఇష్టానుసారం!

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

ఇచ్ఛాపురం.. ఇష్టానుసారం! ● ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ‘సర్‌’ నిర్వహణ తీరుపై అనుమానాలు ● అధికారులను ఆశ్రయించిన వైఎస్సార్‌ సీపీ నేతలు

పారదర్శకంగా చేపట్టాలి..

లోపభూయిష్టంగా సర్‌..

● ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ‘సర్‌’ నిర్వహణ తీరుపై అనుమానాలు ● అధికారులను ఆశ్రయించిన వైఎస్సార్‌ సీపీ నేతలు

కంచిలి:

చ్ఛాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ‘సర్‌’ కార్యక్రమంలో పారదర్శకతపై అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ఫారాల పంపిణీలో జా ప్యం, టీడీపీ నేతల మితిమీరిన జోక్యం, వారికి సంబంధించిన బీఎల్‌ఏల రుబాబు.. కలగలిపి ‘సర్‌’ నిర్వహణ తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎంతో పారదర్శకంగా చేపట్టాల్సిన సర్‌ ప్రక్రియ కొందరు బీఎల్‌ఓలు మెతక వైఖరి, టీడీపీ నేతల అజమా యిషీతో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో సోంపేట పట్టణంలో వైఎస్సార్‌ సీపీ బూత్‌ లెవెల్‌ ఏజెంట్లకు వారు దరఖాస్తులో కోరిన చోట కాకుండా వేరే చోట్ల బూత్‌లు కేటాయించారు. తీరా అక్కడకు వెళ్తే టీడీపీ బీఎల్‌ఏలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోంపేటలో అయితే ఓ టీడీపీ నేత బూతులు తిట్టాడు. పైగా అతడు బూత్‌ ఏజెంట్‌ కూడా కాదు. కంచిలి మండలం పురుషోత్తపు రం పంచాయతీ పరిధి ఆర్‌.గెద్దలపాడు గ్రామంలో 37 ఇళ్లకు ఇప్పటికీ ఫారాలు ఇవ్వలేదు. ఓ మండపంపై కూర్చుని అందరినీ అక్కడికే పిలిపించుకోవ డం కనిపించింది. పెద్దశ్రీరాంపురం గ్రామంలో ఓటర్‌కు ఇచ్చిన రెండు ఫారమ్స్‌ నింపిన వాటిని బీఎల్‌ఓ తీసుకెళ్లి, వాటిని అప్‌లోడ్‌ చేసి తిరిగి ఇస్తా మని చెబుతున్నారు. వాస్తవానికి ఆ ఫారమ్స్‌ను ఓటరు ఇంటి వద్దే అప్‌లోడ్‌ చేసి, అక్నాలెడ్జ్‌ మెంట్‌ను తిరిగి ఓటరుకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది.

ఈ విషయమై ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి సోంపేట తహసీల్దార్‌ అప్పలస్వామిని శుక్రవారం సాయంత్రం కలిసి పరిస్థితిని వివరించారు. మరోవైపు కంచిలి ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి ఆర్‌.గెద్దలపాడు గ్రామంలో బీఎల్‌ఓ తీరును స్థానిక తహసీల్దార్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌ దృష్టిలో పెట్టినట్లు తెలిపారు.

సర్‌ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టాలి. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ప్రక్రియ కొనసాగించాలి. ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా అధికారులు నడిపించాలి.

– సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ

నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం

కంచిలి మండల పరిధిలో సర్‌ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది. పలు గ్రామా ల్లో ఇప్పటికీ ఎన్యుమరేషన్‌ ఫారమ్స్‌ పంపిణీ చేపట్టలే దు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆర్‌.గెద్దలపాడు గ్రామంలో 37 కుటుంబాలకు ఇప్పటికీ ఎన్యుమరేషన్‌ ఫారమ్స్‌ బీఎల్‌ఓ పంపిణీ చేయలేదు.

– పైల దేవదాస్‌రెడ్డి, ఎంపీపీ, కంచిలి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement