● బీసీలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులు ● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి. స్వరూప్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ నాయకుడు కానుమూరి సునీల్‌కుమార్ అరెస్ట్ ఓ చీకటి దినంగా భావిస్తున్నామని పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ అన్నా రు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వరూప్ మాట్లాడు తూ మద్యాన్ని అక్రమంగా రవాణా చేశారంటూ బీసీ వర్గం యాదవ కులానికి సునీల్‌కుమార్‌ను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తే కూట మి ప్రభుత్వంలో ఆయావర్గాల ప్రజలను అణచి వేయడం దుర్మార్గమన్నారు. 2019లో బీసీ వర్గానికి చెందిన కానుమూరు నాగేశ్వరరావు మంత్రిగా గొ ప్ప సేవలందించారని, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఉన్నత విద్యావంతుడని చెప్పారు. అలాంటి వారిని జైల్లో పెట్టి మానసికంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టడం సరికాదన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 200 ఓట్లు కూడా లేని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు అందించి బీసీలకు అన్యాయం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కాపుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగిస్తే కాపుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.
●యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఇవి నకిలీ మద్యం కేసులు కాదని, నారా నకిలీ కేసులని పేర్కొన్నారు. 30 శాతం వైన్ షాపులను తగ్గించి బెల్ట్ షాప్ అనేది లేకుండా చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
●యువజన విభాగం జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోత సతీష్ మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలుచేయడం చేతకాక ప్రశ్నించేవారిపై కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సమావేశంలో యువజన విభాగం శ్రీకాకుళం నగర అధ్యక్షుడు ఎం.భరద్వాజ్, పవన్ కళ్యాణ్, రౌతు సూర్యనారాయణ, బాలి శ్రీనివాసులునాయుడు తదితరులు పాల్గొన్నారు.


