జీవనాధారమే ప్రాణం తీసింది | - | Sakshi
Sakshi News home page

జీవనాధారమే ప్రాణం తీసింది

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

● గొర్రెలను రక్షించబోయి కాపరి మృతి ● ప్రాణాలు కోల్పోయిన 30 గొర్రెలు ● రెడ్డిపేటలో విషాద ఛాయలు

● గొర్రెలను రక్షించబోయి కాపరి మృతి ● ప్రాణాలు కోల్పోయిన 30 గొర్రెలు ● రెడ్డిపేటలో విషాద ఛాయలు

పొందూరు: జీవనాధారమే ఆ కాపరి ప్రాణాలు పోయేలా చేసింది. 40 ఏళ్లుగా గొర్రెల పెంపకాన్ని నమ్ముకుని బతుకుతున్న ఆ వ్యక్తి ఆ గొర్రెలను రక్షించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయారు. పొందూరు– జి.సిగడాం మండలాల సరిహద్దు రైలు పట్టాలకు సమీపంలో ఉన్న గొర్రెల మందలో నుంచి కొన్ని గొర్రెలు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వెళ్లడంతో శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు, గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పొందూరు మండలంలోని రెడ్డిపేట(పుల్లాజీపేట) గ్రామానికి చెందిన శనగల పోతయ్య(47) గొర్లె కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. సుమారు 4 దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. ఎప్పటిలాగానే ఆయన శనివారం గొర్రెల మందను వాండ్రంగి సమీపంలోని రైలు పట్టాల వద్దకు మేత కోసం తీసుకెళ్లారు. అకస్మాత్తుగా కొన్ని గొర్రెలు రైలు పట్టాలమీదకు వెళ్లిపోయాయి. అదే సమయంలో అతివేగంగా వస్తున్న రైలును గమనించి పోతయ్య పరుగు పరుగున పట్టాలపైకి వెళ్లారు. గొర్రెలను రక్షించే క్రమంలో తన సంగతి మర్చిపోయాడు. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 30 గొర్రెలూ చనిపోయాయి. మృతునికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోతయ్య మృతి విషయాన్ని తెలుసుకున్న భార్య కుమారులు పట్టాల వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement