34 బెల్టుషాపులపై కేసులు | - | Sakshi
Sakshi News home page

34 బెల్టుషాపులపై కేసులు

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

● 40.32 లీటర్ల అనధికార మద్యంసీజ్‌ ● బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు

● 40.32 లీటర్ల అనధికార మద్యంసీజ్‌ ● బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు

శ్రీకాకుళం క్రైమ్‌ : సాక్షి దినపత్రికలో ఈ నెల 19న వచ్చిన ‘నేతలు.. మేతలు’ కథనానికి జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ యంత్రాగం స్పందించింది. మద్యం ఎమ్మార్పీపై అదనపు వసూలు, బెల్టుషాపుల్లో విక్రయాలు, అడుగడుగునా అక్రమ మద్యం, అక్రమ వసూళ్లు, నేతలు దర్జాగా దోచేస్తున్న వైనంపై శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 34 బెల్టుషాపులపై ఎకై ్సజ్‌ శాఖ కేసులు నమోదు చేశారు. 40.32 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్‌ చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేశారు.

నెలాఖారువరకు స్పెషల్‌ డ్రైవ్‌..

రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆదేశాలతో ఈ నెలాఖరు వరకు అనధికార మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌రెడ్డిత తెలిపారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.రామచంద్రరావు పర్యవేక్షణలో జిల్లా ఎకై ్సజ్‌ అధికారి సీహెచ్‌ తిరుపతినాయుడు ఆధ్వర్యంలో ఈ డ్రైవ్‌ జరుగుతుందన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా చర్చలు, సమావేశాలు, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement