పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)–2026 కార్యక్రమంలో భాగంగా బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటా సర్వేలు చేసి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్‌ అధికారి కె.సాయిప్రత్యూష అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 14 వరకు సర్వే కొనసాగుతుందన్నారు. ఓటర్లకు ఫారాలు అందించి నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 21న ఉంటుందని, తర్వాత అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. అభ్యంతరాలపై జిల్లా ఎన్నికల అధికారి, ప్రధాన ఎన్నికల అధికారికి అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో అర్బన్‌ ఏపీసీ జానకి, ఎన్నికల డీటీ జి.కె.శ్రీనివాసరావు, నాయకులు ఐ.టి.కుమార్‌, రమేష్‌, పైడి వేణుగోపాల్‌, ఈశ్వరి, పి.ఎం.జె.బాబు, శంకర్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement