ప్రమాదంలో మా బోటు కాలిపోయింది. దీంతో నేను.. నాతో పాటు వేటకు వస్తున్న మరో ఆరుగురి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మాది పెద్ద ఫ్యామిలీ. ప్రస్తుతం ఎటువంటి ఆధారం లేకుండా పోయింది. లక్షల్లో ఆస్తినష్టం జరిగిపోయింది. ప్రభుత్వం స్పందించి మా అందరినీ ఆదుకుంటే ఈ కష్టం నుంచి బయటపడగలం.
– గండుపల్లి బాబూరావు,
బాధితుడు, పెద్ద కర్రవానిపాలెం
ప్రభుత్వం ఆదుకోవాలి
వలలు, బోట్లు దగ్ధమవ్వడంతో మత్స్యకారులంతా తీవ్రంగా నష్టపోయారు. ఇంత భారీ ప్రమాదం జరగడంతో ఈ బోట్లుపై ఆధారపడిన దాదాపు 60 కుటుంబాలు వరకు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం, అధికారులు వేగవంతంగా స్పందించి బాధితులకు నష్ట పరిహారం అందజేయాలి. – కర్రి గోపయ్య,
ఎంపీటీసీ, పెద్ద కర్రివానిపాలెం


