రణస్థలం : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు లావేరులో చేనేత కార్మికులతో కలిసి ధర్నా కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు నేతన్న నేస్తం కింద సంవత్సరానికి రూ.25వేలు ఎప్పటిలోగా అమలు చేస్తారో నేతన్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి.వెంకట్, యు.శంకరయ్య, ఎ.గడ్డియ్య, యు.పెంటలింగ, ఏ.ఉమా, కె.జాంబ, ఎన్.రుద్రయ్య, యు.కాశి, ఏ.వేణు తదితరులు పాల్గొన్నారు.


