హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే శరణ్యం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే శరణ్యం

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఉద్యోగుల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే శరణ్యమని ఏపీ అమరావతి జేఏసీ జిల్లా అధ్యక్షుడు బీవీఎన్‌ రాజు అన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై ఉద్యమబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా సర్వే ఉద్యోగుల సంఘం, గణాంక శాఖ ఉద్యోగుల సంఘం, ట్రెజరీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు జేఏసీ అధ్యక్షుడిని కలిసి మద్దతు ప్రకటించారు. సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.జగన్‌, కార్యవర్గ సభ్యులు, గణాంక శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.సుధాకరరావు, కార్యవర్గ సభ్యులలు, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ట్రెజరర్‌ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పి.వి.రమణ తదితరులు మద్దతు తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement