జిల్లా రిజిస్ట్రార్‌గా సంజీవయ్య | - | Sakshi
Sakshi News home page

జిల్లా రిజిస్ట్రార్‌గా సంజీవయ్య

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

జిల్లా రిజిస్ట్రార్‌గా సంజీవయ్య ‘మా వద్ద రికార్డులు లేవు’ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో కాస్త మెరుగు ‘దళితులపై దాడులు తగవు’

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్‌గా బి.సంజీవయ్య విధుల్లో చేరారు. ఈయన కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ హెచ్‌ఓడీగా విజయవాడలో వి ధులు నిర్వహించి పదోన్నతిపై జిల్లాకు వచ్చా రు. ఈయన శ్రీకాకుళం జిల్లాలో 1986లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పలాస–కాశీబుగ్గలో పనిచేశారు. రాజాం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీ తికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు జరిగేలా చర్యలు చేపడతానన్నారు. క్రయ, విక్రయదారులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందు లు వచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు.

సంతబొమ్మాళి: ‘చెరువు ఆక్రమణ జరగవ చ్చు.. అయితే దానికి సంబంధించి రికార్డులు మా వద్ద లేవు’ అంటూ రెవెన్యూ, పంచాయతీ అధికారులు చేతులెత్తేశారు. ‘అప్పట్లో ఒక పెద్ద చెరువుండేది’ అనే కథనం ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ప్రచురి తం కావడంతో రెవెన్యూ, పంచా యతీ అధికారులు స్పందించా రు. నౌపడ అర్‌ అండ్‌బీ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒత్తగుండమ్మ చెరువును ఆర్‌ఐ చంద్రమౌళి, సర్వేయర్‌ సురేష్‌, వీఆర్వో జోగారావు గురువారం పరిశీలించారు. సర్వే నంబర్‌ 418 గ్రామ కంఠానికి సంబంధించిందని, దానికి సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని రెవెన్యూ అధికారులు తేల్చేశారు. గ్రామ పంచాయతీలో ఉండవచ్చునని చెప్పారు. పంచాయతీ కార్యదర్శిఽ ఉప్పాడ ఉమాపతిని అడుగ గా అలాంటి రికార్డులు ఏమీ లేవని సమాధా నం ఇచ్చారు. ఎఫ్‌ఎంలో చెరువుకు సంబంధించిన విస్తీర్ణం లేదని, అయితే ఎస్‌ఎల్‌ఆర్‌లో ఆ చెరువుకు సంబంధించిన కాగితం పూర్తిగా చింపేసి ఉందని తెలిసింది. ఇది ఎప్పుడు జరిగింది, ఎవరి హయాంలో రికార్డులు మాయం అయ్యాయో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల ని గ్రామస్తులు కోరుతున్నారు. చెరువును పునరుద్ధరించి వర్షపునీరు, వరదనీరు తమ ఇళ్లలోకి రాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పబ్లిక్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి ఫలితాలతో పోల్చితే సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కాస్త నయమని అనిపించారు. ఫస్టియర్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 5వ స్థానం, ద్వితీ య సంవత్సరం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 10వ స్థానంలో నిలిచారు.

ఉత్తీర్ణత సాధించారిలా..

సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ప్రథమ సంవత్స రానికి సంబంధించి 4937 మంది పరీక్ష రాయ గా.. 43 శాతం ఉత్తీర్ణతను సాధించి, 2113 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయం సంవత్సరానికి సంబంధించి 5221 మంది పరీక్షకు హాజరుకాగా.. 56 శాతం ఉత్తీర్ణతతో 2911 మంది పాసయ్యారు.

26లోగా దరఖాస్తు చేసుకోవాలి..

రీ వెరిఫికేషన్‌(ఆర్‌వీ)/రీ కౌంటింగ్‌(ఆర్‌సీ) కో సం విద్యార్థులు ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్‌బోర్డు జిల్లా ఆర్‌ఐఓ ఎం.కృష్ణవేణి పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్‌ కోసం సబ్జెక్టుకు రూ.1300, రీ కౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ. 260 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపా రు. ఈ ఫీజులను వారు చదువుకుంటున్న కళా శాలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు.

నందిగాం: కూటమి ప్రభుత్వంలో దళితులపై నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయని దళిత మహాసభ జిల్లా కార్యదర్శి అక్కురాడ లోకనాథం అన్నారు. గురువారం నందిగాంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులను వర్గీకరణ పేరుతో రెండు వర్గాలుగా విడదీసి, ఐక్యత లేకుండా చేసి రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకులు దాడులు, హత్యలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. మాచెర్లలోని పిడుగురాళ్లలో దళితుడుని హింసించి హత్య చేశారని, అలాగే కోటబొమ్మాళి మండలం కొత్తపల్లిలో తెలుగుదేశం వారు స్థానిక అగ్రవర్ణాలవారితో కలిసి దళితుని ఇల్లు జేసీబీలతో కూలదోయించి, ని వాసం లేకుండా చేశారని మండిపడ్డారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సంస్కృతి కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో వీటికి పర్యవసానాల ను తెలుగుదేశం పార్టీ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement