జాహ్నవికి అభినందనలు | - | Sakshi
Sakshi News home page

జాహ్నవికి అభినందనలు

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

జాహ్నవికి అభినందనలు

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని, ఎన్‌.ఎస్‌.ఎస్‌ వలంటీర్‌ సనపల జాహ్నవి కళాశాలకు గర్వకారణంగా నిలిచిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు పేర్కొన్నారు. జాతీయ స్థాయి ‘వికసిత్‌ భారత్‌’ యూత్‌ పార్లమెంట్‌కు ఎంపికై న జాహ్నవిని అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపాల్‌ అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌.చిన్నారావు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్‌ ఎస్‌.పద్మావతి, అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ కె.మౌనిక, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ టి.ఆదిలక్ష్మి, ఎన్‌ఎస్‌.ఎస్‌ పీఓలు రుద్రమరాణి, ఐ.హేమ పద్మజ, పి.జమున పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement