శ్రీకాకుళం కల్చరల్: జిల్లాలోని బాల, బాలికలు, యువతలో మ్యూజిక్ టాలెంట్‌ను వెలికి తీసేందుకు డాక్టర్ కనుగుల దుర్గా ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్, వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయం, జీబీఏ స్వరమాధురి సంయుక్త ఆధ్వర్యంలో సంగీత ప్రతిభా పోటీలు నిర్వహించనున్నట్లు జీబీఏ స్వరమాధురి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పీఎన్‌కాలనీలోని వరసిద్ధి వినాయక దేవాలయంలో కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. రెండు గ్రూపుల్లో 8–14 ఏళ్లు, 15–21 ఏళ్ల వయస్సు కలిగినవారికి గాత్రము పోటీలు, 8 నుంచి 21 ఏళ్లలోపు వారికి కీబోర్డు, గిటార్, తబలా, మృదంగం, వయోలిన్ వాద్యాలపై పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు జూలై 15వ తేదీలోపు 90000 50235 నంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ.. స్వయంగా గానీ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పోటీల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సమావేశంలో స్వరమాధురి అధ్యక్షుడు, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్‌రావు, చార్టెడ్ అకౌంటెంట్ కనుగుల దుర్గా శ్రీనివాస్, జీబీఏ స్వరమాధురి కార్యదర్శి డాక్టర్ నిక్కు అప్పన్న, కన్వీనర్ ఎంవీ కామేశ్వరరావు, కమిటీ సభ్యులు బండారు రమణమూర్తి, వైకుంఠరావు, చక్రవర్తి, పీవీఆర్ ఎం.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


