రాష్ట్రంలో కూటమి పాలన కాదు సిండికేట్ పాలన జరుగుతోంది. అంతా వ్యాపార ధోరణిలో దోచుకుంటున్నారు. రైతుభరోసా, క్రాప్ ఇన్సూరెన్స్ వంటి పథకాలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనతో వచ్చినవి. ఆ విధానాలనే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా పీఎంకిసాన్, పీఎంఎఫ్‌బీవై పథకాల పేరిట అమలుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలవారినీ మోసం, దగా చేయడమే తప్ప పథకాలు అమలు చేయడం లేదు. నేరడి బ్యారేజ్, వంశధార ఫేజ్–2, స్టేజ్–2 అనేవి చిన్నపిల్లాడిని అడిగినా వైఎస్సార్, ధర్మాన ప్రసాదరావుల చలువేనని చెబుతారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు చేసేదేమీ లేక ట్రిబ్యునల్ గెజిట్ ఇస్తే అవి తామే చేశామని చెప్పడం సిగ్గుచేటు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులను క్యూలైన్లలో ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోం.
– డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి,
డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
అవగాహన రాహిత్యం..
హిరమండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ వృథాగా పెట్టారని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తానికి నీరు అంది పంటలు సస్యశ్యామలం అవుతాయి. కానీ అలా చేయడం లేదు. చంద్రబాబు అడుగు జాడల్లోనే అచ్చెన్నాయుడు నడుస్తుంటారు.
– గొండు రఘురాం,
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్


