ఐటీఐ కుర్రోడు.. గంజాయికి బానిసయ్యాడు! | - | Sakshi
Sakshi News home page

ఐటీఐ కుర్రోడు.. గంజాయికి బానిసయ్యాడు!

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

టెక్కలి– మెళియాపుట్టి రోడ్డులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని టెక్కలి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు టెక్కలి పోలీసుస్టేషన్‌లో సీఐ ఎ.విజయ్‌కుమార్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మెళియాపుట్టికి చెందిన ఓ విద్యార్థి టెక్కలిలో ఐటీఐ సెకెండియర్‌ చదువుతున్నాడు. గంజాయి బానిసయ్యాడు. స్నేహితుడితో కలిసి డ్యాన్స్‌ ఈవెంట్స్‌కు వెళ్తూ టెక్కలి శ్రీనివాసనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఒడిశాలో తక్కువ ధరకే గంజాయి దొరుకుతుందని, ఇక్కడికి తీసుకొచ్చి అధిక మొత్తంలో అమ్ముకోవచ్చని ఐటీఐ విద్యార్థికి స్నేహితుడు సలహా ఇచ్చారు. ఈ మేరకు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా బడగాం గ్రామానికి చెందిన బారిక సభాపతి నుంచి మంగళవారం రెండు కేజీల గంజాయి తీసుకొస్తుండగా మెళియాపుట్టి రోడ్డులోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కింద పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. –టెక్కలి రూరల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement