పేరుకు మినరల్‌.. శుభ్రత నిల్‌ | - | Sakshi
Sakshi News home page

పేరుకు మినరల్‌.. శుభ్రత నిల్‌

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

టెక్కలి జిల్లా ఆస్పత్రిలో మినరల్‌ పేరిట కలుషిత నీటి సరఫరా

ఆందోళనలో రోగులు

టెక్కలి రూరల్‌: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో రోగులకు మినరల్‌ వాటర్‌ పేరిట కలుషిత నీరు అందిస్తున్నారు. ఆస్పత్రిలో తాగునీటి సమస్య ఉండడంతో మినరల్‌ వాటర్‌ అందించే ఏర్పాటు చేయగా.. అందులోనుంచి కూడా కలుషిత నీరే వస్తోంది. ఆస్పత్రిలోని మినరల్‌ వాటర్‌ క్యాన్‌లలో నాచు పేరుకుపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగకుంటే గొంతు ఎండుతుంది. తాగితే రోగాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది నెలలుగా ఆస్పత్రిలో ఉన్న ఆర్‌ఓ ప్లాంట్‌ మరమ్మతులకు గురైన విషయం అందరికి తెలిసిందే. దాన్ని బాగు చేయకుండా మినరల్‌ వాటర్‌ క్యాన్‌లతో రోగులకు తాత్కాలికంగా తాగునీరు అందిస్తున్నా రు. అయితే అందించిన తాగునీరు కూడా కలుషితంగా నాచుపట్టి ఉండటంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు రోగులు, రోగుల బంధువులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement