● రికార్డు స్థాయిలో 3 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు
● వేసవి సీజన్‌లో ఏకంగా రూ. 64.74 కోట్లకు పైగా ఆదాయం
శ్రీకాకుళం క్రైమ్ : భగభగ మండే ఎండల్లో మద్యం రుచికి అలవాటు పడిన మందు ప్రియులు చల్లని బీర్ల వైపు మొగ్గుచూపారు. జిల్లాలో ఈ వేసవి సీజన్‌లో రికార్డు స్థాయిలో 3 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగినట్లు సంబంధిత జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపింది. ఏప్రిల్, మే నెలలోనే కాక జూన్ 10 వరకు బీర్ల అమ్మకాలు ద్వారా ఏకంగా రూ. 64.74 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా ఒక్క మే నెలలోనే మందుబాబులు 1,50,022 కేసుల బీర్లు గుటుక్కుమనిపించినట్లు పేర్కొన్నారు.


