ప్రొవిజనల్‌ ఎంపిక జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

ప్రొవిజనల్‌ ఎంపిక జాబితా విడుదల

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

ప్రొవిజనల్‌ ఎంపిక జాబితా విడుదల ఆదిత్యుని సన్నిధిలో మహాలింగార్చన ‘భూముల అప్పగింతపై తప్పుడు ప్రచారం’ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా అభిషేక్‌ మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఎచ్చెర్ల: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కారక్రమంలో ప్రవేశాల కోసం ప్రొవిజనల్‌ ఎంపిక జాబి తా విడుదలైంది. క్యాంపస్‌ల వారీగా కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. శ్రీకాకుళం క్యాంపస్‌లో జూన్‌ 23, 24వ తేదీల్లో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. జూలై 1వ తేదీనుంచి తరగతు లు ప్రారంభం కానున్నాయి. ధ్రువీకరణ పత్రా ల పరిశీలన అనంతరం ప్రవేశాలను ఖరారు చేయనున్నారు. ఎంపికై న అభ్యర్థులు నోటిఫై చేసిన షెడ్యూల్‌ ప్రకారం సంబంధిత కౌన్సిలింగ్‌ కేంద్రాలకు అవసరమైన అన్ని అసలు ధ్రువీ కరణ పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని ఆర్టీయూకేటీ ఏపీయూజీ ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు.

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా శివపంచాయతన సహిత మహాలింగార్చనను శనివారం ఉదయం స్థానిక అనివెట్టి మండపంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకు లు ఇప్పిలి సాందీప్‌శర్మ లింగార్చనను శా స్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు. అలా గే శనిత్రయోదశి కూడా కావడంతో భక్తులు నవగ్రహ మండపంలో ప్రత్యేకంగా పూజలు జరిపించుకున్నారు. శనిగ్రహ దోష పూజలు, తైలాభిషేకాన్ని చేయించారు. అర్చకులు కిరణ్‌శర్మ, హరిప్రసాద్‌ శర్మలు ప్రత్యేకంగా భక్తుల పేరిట పూజలు నిర్వహించారు.

మందస: రాంపురం గ్రామంలో ప్రజలు కార్గో ఎయిర్‌పోర్టుకు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారనేది అవాస్తవమని ఆ గ్రామ రైతు లు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచా రాలు మానుకోవాలని, భూములు ఇచ్చేదే లేదని వారు తేల్చి చెప్పారు. గత 20 నెలలుగా తాము ఎన్నో విధాలుగా నిరసనలు తెలుపుతున్నామని, కలెక్టర్‌, ఎమ్మెల్యేలకు ఇతర అధికారులకు కూడా స్పష్టంగా తమ అభిప్రాయాలను చెప్పామని తెలియజేశారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆపాలని, కార్గో ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. కార్యక్రమంలో బాధిత రైతులు దున్న రామారావు, మర్ల సంతోష్‌, జుత్తు భూపతి, తామాడ వా సు, జోగారావు, సురేష్‌, ఎర్రయ్య, కీలు కాంతమ్మ, రామస్వామి, కూర్మారావు, కృష్ణరావు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

హిరమండలం: మండలంలోని కల్లట గ్రామానికి చెందిన బలగ అభి షేక్‌ ఇటీవల నిర్వహించిన యూపీఎస్‌సీలో అసిస్టెంట్‌ కమాండెంట్‌(సీఏపీఎఫ్‌) ఉద్యో గం సాధించాడు. దేశ భద్రత కోసం, దేశ సేవ కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందని అభిషేక్‌ తెలిపారు. అభిషేక్‌ ఎంపికపై గ్రామస్తులు అభినందించారు.

మెళియాపుట్టి: పెద్దమడి గురుకుల జూనియర్‌ కళాశాలలో(బాలురు) మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ స్వప్నిల్‌ పవార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీసీ–10, బైపీసీ 11, సీఈసీ–12 మొత్తం 33 మిగులు సీట్లకు పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందిన గిరిజన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, మెరిట్‌ విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈనెల 24వ తేదీన కౌన్సెలింగ్‌కు సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరవ్వాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement