నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్య లు, ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ‘చంద్రబాబు వెన్నుపోటు కు రెండేళ్లు’ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 8 నియోజవర్గాల్లో విజయవంతమైందని ఆయ న ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినా, కేసులు పెడతామని బెదిరించినా ప్రజలు లెక్క చేయలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిరస న కార్యక్రమాలను సమన్వయం చేసి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ సమన్వయ కర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ కమిటీల అధ్యక్షులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ అన్ని స్థాయిల నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.


