నగర కుల విద్యార్థులకు ఉపకార వేతనాలు | - | Sakshi
Sakshi News home page

నగర కుల విద్యార్థులకు ఉపకార వేతనాలు

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో నగర కులానికి చెంది పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా స్కాలర్‌షిప్‌లు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు జిల్లా నగరాల సంఘం కార్యదర్శి పండు రాజగోపాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురికి, ఇంటర్మీడియెట్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురికి ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల వారు మార్కుల జాబితా జిరాక్స్‌ కాపీలు, ఫోన్‌ నంబర్‌ వివరాలను ఈ నెల 25లోగా 94404 59656, 96037 09549 నంబర్లకు పంపించాలని కోరారు.

అప్పలనాయుడుకు ఏఈఓగా పదోన్నతి

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గడి అప్పలనాయుడు (నిద్దాం నాయుడు)కు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఏఈవో)గా పదోన్నతి కల్పిస్తూ దేవదాయశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్‌ హోదా గల అరసవల్లి ఆలయంలో ఏఈవో పోస్టు మంజూరు కావాల్సి ఉంది. అయితే ఈ క్యాడర్‌స్ట్రెంత్‌ త్వరలోనే అమలు కానున్న నేపథ్యంలో తొలిసారిగా ఏఈవోగా అప్పలనాయుడు ఇక్కడే విధులు నిర్వర్తించే అవకాశముంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement