●కనిపించని పొదుపు.. అంతా మదుపే | - | Sakshi
Sakshi News home page

●కనిపించని పొదుపు.. అంతా మదుపే

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

●కనిపించని పొదుపు.. అంతా మదుపే

ప్రజలంతా పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే పొదుపు కేవలం ప్రజలకు మాత్రమేనని తమకు కాదని సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన తేటతెల్లం చేసింది. స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి భారీ కాన్వాయ్‌ ఉపయోగించారు. జనాల తరలింపు కోసం విస్తృతంగా వాహనాలను వాడారు. పొదుపు పాటిస్తున్నామంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు రోడ్డుకు ఒక మార్గంలో కేవలం నాలుగు వాహనాల తో సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ ప్రజావేదిక వరకు కొనసాగింది. మరో మార్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో భారీ కాన్వాయ్‌ సభా ప్రాంగ ణం వద్దకు చేరుకుంది. వీటితో పాటు తామరాపల్లి వద్ద నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి సైతం అధిక సంఖ్యలోవాహనాల తరలింపు కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement