కొత్తూరు: జిల్లాలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని నిర్వాసి తుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాజు సింహాచలం డిమాండ్ చేశారు. మండలంలోని మెట్టూరు బిట్–3 ఇరపాడు నిర్వాసితుల కాలనీలో నిర్వాసితులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ 2024 మార్చి నెలలో కొత్తూరులో వంశధార ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన సందర్భంగా కొత్తూరులో అప్పటి ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జిల్లా పర్యాటకు వస్తున్న చంద్రబాబు నాయుడు నిర్వాసితులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు అధికారులకు ఆదేశించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కనీసం హమీ అమలును పట్టించుకోలేదన్నారు. హామీ ని అమలు చేయపోతే నిర్వాసితులతో మరో ఉద్యమం తప్పదన్నారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
నరసన్నపేట: స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసన్నపేటకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు తెలిపారు. శుక్రవారం వీరు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలసి సీఎం రూట్ మ్యాప్‌ను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు.
సీఎం పర్యటనకు పటిష్ట
బందోబస్తు
శ్రీకాకుళం క్రైమ్ : సీఎం చంద్రబాబు శనివారం నరసన్నపేట రానున్న సందర్భంగా భద్రతా పరంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 90 మంది ఎ్‌స్‌ఐలు సహా హెచ్‌సీలు, పీసీలు, హోంగార్డులతో సహా దాదాపు 1550 మంది బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీరే కాక 2రోప్ పార్టీలు, 6 స్పెషల్ పార్టీలు విధుల్లో ఉంటారన్నారు. భద్రతా పరమైన చర్యల్లో భాగంగా ప్రైవేటు డ్రోన్ కెమెరాల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అరసవల్లి రథసప్తమి నుంచి ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నా అమలు చేయడంలో విఫలమవుతున్నారు.
తేనెటీగల దాడిలో ఉపాధి వేతనదారులకు గాయాలు
పొందూరు: కొంచాడ పంచాయతీ పరిధిలోని యాగాటిపేట గ్రామం వద్ద శుక్రవారం తేనెటీగలు దాడి చేయడంతో ముగ్గురు ఉపాధి హామీ వేతనదారులతో పాటు పలువురు గ్రామస్తులు గాయపడ్డారు. ఓ చెట్టు కింద వంట చేస్తున్న సమయంలో పైకి పొగ వెళ్లడంతో తేనెటీగలు కదిలిపోయి సమీపంలో ఉన్న వారిపై దాడి చేశారు. అదే సమయంలో ఉపాధి పని కోసం దుబ్బులు చెరువుకు వెళ్తున్న ఉపాధి వేతన దారులు షేక్‌లాల్‌బీ, జి.జయమ్మ, వై.చిన్నమ్మడులతో పాటు గ్రామానికి చెందిని వై.శివకుమార్, వై.సూర్య, ఎస్.హరికృష్ణ, యు.మంగమ్మ, పి.గౌరమోమలకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆటోల సహాయంతో పొందూరు సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
‘పెంచిన ధరలు తగ్గించాలి’
ఎచ్చెర్ల: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు మండల కన్వీనర్ ఎస్.వి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో బీజేపీ కూటమి సర్కార్ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరు తూ సీపీఎం ఆధ్వర్యంలో వినూత్నంగా లారీకి తాడు కట్టి లాగి నిరసన తెలియజేశారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల జీవ నం చిన్నాభిన్నమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.


