● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే శనివారం నరసన్నపేటకు వస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు లేవని, గిట్టుబాటు ధర రాక సాగుదారులు అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ క్వింటాల్‌కు రైతులు రూ. 700 వరకూ నష్ట పోతున్నారని ఇవేవీ ముఖ్యమంత్రికి కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ఆరోగ్య శ్రీ బిల్లులు రాక ఆస్పత్రుల్లో రోగులను వెనక్కి పంపుతు న్నారని, కొత్త పింఛన్ల ఊసే లేదని ధ్వజమెత్తారు. వంశధార, టెక్కలి ఆఫ్ షోర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ, మూలపేట పోర్టు ని ర్మాణాన్ని గాలికి వదిలేశారని మండి పడ్డారు. జిల్లాలో ఇన్ని ప్రదాన సమస్యలు పక్కన పెట్టి కేవలం స్వచ్ఛ ఆంధ్రా, స్వర్ణాంధ్ర అంటూ చెత్త పేరుతో ముఖ్యమంత్రి పర్యటిస్తుండటం ప్రజలను వంచించడమేనని కృష్ణదాస్ విమర్శించారు.


