రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి పైడిభీమవరం వైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ పరిశ్రమ బస్సును బుడుమూరు వద్ద వెనుకనే వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమ చెందిన ఉద్యోగులను ఎక్కించుకునేందుకు బుడుమూరు వద్ద రెడ్డీస్‌కు చెందిన బస్సు శుక్రవారం ఉదయం 5.50గంటల సమయంలో ఆగింది. ఈ సమయంలో వెనుకనే వస్తున్న ఆటో బస్సును ఢీకొట్టింది. ఆటో డ్రైవర్‌కు బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ఉన్న టమోటాలు, కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి.


