రెండేళ్ల పాలనలో జిల్లాకు ఏమిచ్చారు? | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పాలనలో జిల్లాకు ఏమిచ్చారు?

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి

హిరమండలం : గత రెండేళ్లలో సీఎం చంద్రబాబు జిల్లాకు ఏమిచ్చారో చెప్పాలని వైఎస్సార్‌ సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేవలం రాజకీయ పర్యటనలకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో ఏవర్గానికీ న్యాయం చేయడం లేదని ధ్వజమెత్తారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం లేదని, సాగునీరు ఇవ్వడంలో కూడా విఫలమవుతున్నారని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించలేని స్థితిలో ఉండటం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. కూటమికి ప్రజాగుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement