కల్వర్టును ఢీకొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

కల్వర్టును ఢీకొన్న బైక్‌

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

నరసన్నపేట: గొట్టిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్నపేట పట్టణం జగన్నాథపురానికి చెందిన అనుపోతుల శ్రీనివాసరావు(43) మృతి చెందాడు. గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై బసివలస వైపు నుంచి నరసన్నపేటకు వస్తున్న శ్రీనివాసరావు అదుపు తప్పి కల్వర్టు మదుముకు ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తీవ్ర గాయాలపాలై కల్వర్టులోనే మృతిచెందాడు. శ్రీనివాసరావు మడపాం టోల్‌గేట్‌ వద్ద టీస్టాల్‌ నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య శ్రీదేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసన్నపేట ఎస్సై–2 శేఖరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టీస్టాల్‌ నిర్వాహకుడు మృతి

Advertisement
 
Advertisement
Advertisement