అరసవల్లిలో సహస్ర మహాలింగార్చన | - | Sakshi
Sakshi News home page

అరసవల్లిలో సహస్ర మహాలింగార్చన

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో క్షేత్రపాలకులైన భువనేశ్వరి రామలింగేశ్వర స్వామి వారికి సహస్ర మహాలింగార్చన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. మాసశివరాత్రి సందర్భంగా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ అనివెట్టి మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు, మాససంక్రమణం సందర్భంగా గర్భాలయంలో సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టుకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం నిజరూపంతో పాటు ప్రత్యేక అలంకరణతో భక్తులకు సర్వదర్శనాలకు అనుమతించారు.

జిల్లా కార్యవర్గం కరువు

శ్రీకాకుళం : జిల్లా తెలుగుదేశం పార్టీకి కార్యవర్గం లేకుండా పోయింది. రాష్ట్ర నాయకత్వం జిల్లా కార్యవర్గాన్ని ఫిబ్రవరి నెలలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చును భరించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేస్తున్నారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. కార్యాలయ మేనేజర్‌గా పని పనిచేసిన వ్యక్తి ఇటీవలే హత్యకు గురైన విషయం పాఠకులకు తెలిసిందే. ఇది జరిగి కూడా మూడు నెలలు అయినప్పటికీ నేటికీ ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. పార్టీ పరిస్థితి, జిల్లా కార్యాలయ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు గానీ, శాసనసభ్యులు గానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు ప్రారంభం రేపు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌, శ్రీకాకుళం జిల్లా సెపక్‌తక్రా సంఘం చైర్మన్‌ ఎమ్మెస్సార్‌ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు ఆదివారం నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నెలరోజులపాటు జరగనున్నాయని కోచ్‌ జి.అర్జున్‌రావురెడ్డి శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో బాస్కెట్‌బాల్‌, సెపక్‌తక్ర క్రీడలకు సంబంధించి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు శిబిరాలు మొదలవుతాయని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నెల ఒకటో తేదీ నుంచే శాప్‌ ఆదేశాల మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాలు జరుగుతున్నప్పటికీ.. అసోసియేషన్‌ల తరఫున క్రీడాకారులకు అనేక సదుపాయాలను కల్పిస్తూ శిక్షణ నిర్వహించాలని ఎమ్మెస్సార్‌ తలచారని చెప్పారు. ఎనిమిదేళ్లు దాటిన బాలబాలికలు క్యాంపులో పాల్గొనవచ్చన్నారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9949291288 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

విజ్ఞానశాస్త్రంలో కృత్యాధార బోధన

శ్రీకాకుళం: విజ్ఞాన శాస్త్రంలో కృత్యాధార బోధన విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవిబాబు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయులకు విద్యుదయస్కాంతత్వంపై వర్క్‌ షాపు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రయోగ సంబంధిత కిట్‌ను ఫిజిక్స్‌ ఫారమ్‌ను ఎస్‌.సాయి శ్రీనివాస్‌ రూపొందించడం అభినందనియమన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. పాఠశాలలో వినియోగించి రిన్ని కృత్యాలు విద్యార్థులు స్వయంగా చేసేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం రిసోర్స్‌ పర్సన్‌ బి.వెంకటరావును డీఈఓతో కలిసి ఉపాధ్యాయులు సన్మానించారు. ఫిజిక్స్‌ ఫారమ్‌ జిల్లా అధ్యక్షుడు జి.లక్ష్మణరావు, విశాఖ జిల్లా ఏపీసీ, ఐఏపీటీ రాష్ట్ర అధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌, డీసీఈబీ సెక్రటరీ సంజీవరావు, ఇన్‌చార్జి హెచ్‌ఎం సీతన్నాయుడు, ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌, కిరణ్‌, కామేశ్వరరావు, రామకృష్ణ, కృష్ణారావు, వేణుగోపాల్‌, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష

సారవకోట: బుడితిలో 2024లో జరిగిన చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన వర్ల శివ అలియాస్‌ మున్నాకు 8 నెలల 10 రోజుల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ పాతపట్నం జూనియర్‌ సివిల్‌ జడ్జి రోషిణి శుక్రవారం తీర్పునిచ్చారు. ఈ మేరకు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement