శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఏపీఈఏపీసెట్–2026 పరీక్షలు అధికారుల పర్యవేక్షణ నడు మ అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల్లో భాగంగా మూడోరోజు గురువారం రెండు సెషన్లలో జరిగిన పరీక్షకు 96.12 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. నాలుగు కేంద్రాల్లో జరుగుతు న్న ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు రెండు సెషన్లకు కలిపి 1443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 1387 మంది పరీక్షకు హాజర య్యారు. వివిధ కారణాలతో 56 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌కు 720 మందికి 694 మంది, మధ్యాహ్నం సెషన్‌కు 723 మందికిగాను 693 మంది ఆన్‌లైన్ పరీక్షకు హాజరయ్యారు.
నరసన్నపేట: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడో విడత ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్‌ఏలను నియమించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దోమ మన్మధరావు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎస్‌ఐఆర్ నోటిఫికేషన్ కాపీని గురువా రం మబగాంలో కృష్ణదాస్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ తరఫు న జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రానికీ బీఎల్‌ఏలను నియమించాలని సూచించారని, ఈ విషయంలో నియోజకవర్గ సమన్వయకర్త లు మరింత బాధ్యతగా ఉండాలన్నారు. వీరందరికీ నియోజకవర్గాల వారీగా శిక్షణ నిస్తారని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో మ నం అప్రమత్తంగా లేక పోతే మన ఓట్లు పోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఒక్క ఓటు కూడా పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, బాధ్యత కలిగిన అవగాహన ఉన్న కార్యకర్తలను బీఎల్‌ఏలుగా నియమించాలని కృష్ణదాస్ సూచించారు. ఈ నెల 20 కల్లా నియామకాలు పూర్తి చేయాలన్నారు. బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దోమ మన్మధరావు మాట్లాడుతూ బీఎల్ ఏలకు శిక్షణ ఉంటుందన్నారు.
నరసన్నపేట: క్రీడల అభివృద్ధికి శ్రీకాకుళం జిల్లా ఎంతో అనుకూలంగా ఉందని డీఎస్‌డీఓ మహేష్ అన్నారు. జిల్లాలో క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని, క్రీడల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయ న హామీ ఇచ్చారు. స్థానిక పీఎం శ్రీ స్కూల్లో వాలీబాల్, సాఫ్ట్‌బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపులను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ఏ సౌకర్యం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కో రారు. స్థానిక వైద్యులు గొలివి మోహనరావు, లయన్స్ క్లబ్బు ప్రతినిధిలు ఊణ్ణ రంగనాథ్, సాహూ, పొట్నూరు రమేష్, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు మాట్లాడుతూ నరసన్నపేటలో క్రీడాకారులకు అండగా ఉంటామన్నారు.


