రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం
ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళనలో పేదలు
శ్రీకాకుళం పాతబస్టాండ్:
ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుంటే.. ప్రభుత్వం పాత రేషన్ కార్డులు రద్దు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 7, 8వ తేదీల్లో విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ిసీఎం చంద్రబాబు నాయుడు కార్డుల తొలగింపుపై దిశా నిర్దేశం చేశారు. ఉన్నకార్డులను తగ్గిస్తేనే సంక్షేమాలు అందించగలమని ఆయన స్పష్టం చేశా రు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతోంది. ఇప్పటివరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పీజీఆర్‌ఎస్‌లోనూ, తహసీల్దారు కార్యాల యాల్లోనూ కొత్త కార్డుల కోసం దరఖాస్తులు వేల ల్లో వచ్చాయి. ఉన్న కార్డును విడగొట్టే వెసులుబాటు కూడా కల్పించలేదు. ఒక చోట నుంచి మరొక చోటుకి రేషన్ కార్డును మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చాలా మంది ప్రజలు పిల్ల ల పేర్లను కార్డులో చేర్పించుకునేందుకు, కొత్తగా కార్డును తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 6,60,730 కార్డులు ఉన్నాయి. వీటిలో 19,39,082 యూనిట్లు ఉన్నాయి. వీటిలో బీపీఎల్, ఏఏవై, అంత్యోదయ వంటి కార్డులు కూ డా ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివాహం అయిన వారు, పిల్లలు పుట్టిన వారు, వా రికి ఉన్న కార్డులో కొత్తగా పేర్లు చేర్చుకునే అవకాశం లేదు. దీంతో వారు రేషన్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. పోర్టల్‌లోనూ ఈ ఆప్షన్లు పూర్తిగా తీసేశారు. కార్డుల ఏరివేత ప్రక్రియ వెనుక రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా..
వైఎస్సార్‌సీపీ హయాంలో కొత్త కార్డుకి దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారం తిరగకుండా కొత్త కార్డు మంజూరయ్యేది. మరుసటి నెల నుంచే బియ్యం వారికి చేరేది. ఈ కార్డు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులతో పాటు ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనం, పిల్లల చదువులు, రుణాలు, ఉపకార వేతనాలు, ఫీజ్ రీయింబర్స్‌మెంటు, ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఉపయోగపడేది.ఇప్పుడు ఆ భాగ్యం లేకుండా పోయింది.


