జిల్లాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

జిల్లాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? ● సీపీఎం నాయకుల సూటి ప్రశ్న

● సీపీఎం నాయకుల సూటి ప్రశ్న

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాకు ఇదివరకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యు లు కోనారి మోహనరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీపీఎం కార్యాలయంలో గురువారం మీడి యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో వంశధార, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌తో పాటు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్ఛాపురం వరకు నీరందిస్తామని చెప్పిన హామీ నేటికీ నీటి మూటగా మిగిలిపోయిందన్నారు. నేరడి బ్యారేజ్‌కు ఎందుకు నిధు లు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పైడిగాం ప్రాజెక్టు మరమ్మతులు చేస్తామని, కొండపేట లిఫ్ట్‌తో సహా అన్ని లిఫ్టులు మరమ్మతు చేస్తామన్న హామీ అమలు చేయలేదని విమర్శించారు. జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చేసిన వాగ్దానం నేటికీ అమలు చేయకపోవడంతో జీడి రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం నెరవేర్చ లేదన్నారు. వంశధార రిజర్వాయర్‌ నిర్వాసితులకు స్పెషల్‌ ప్యాకేజీ ఇస్తామన్న హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బ ర్‌, శ్రీకాకుళం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ సదుపాయాలు అన్నీ హామీలు గానే ఉన్నాయన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం, వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలన్నారు. జిల్లాను విధ్వంసం చేసే కొవ్వాడ అను విద్యుత్‌ కేంద్రాన్ని రద్దు చేయాలని, ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని, శ్రీకాకుళం జిల్లాను కార్పొరే ట్‌ కంపెనీలకు ఇస్తే శ్రీకాకుళానికి ప్రజలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ లేకుండా పోతుందన్నారు. సరుబుజ్జిలి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ రద్దు చేయాలని, భూసేకరణ ఆపాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement