వజ్రపుకొత్తూరు రూరల్: నీట్ రద్దు ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం అని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎల్.వెంకటాచలం అన్నారు. మండల కేంద్రమైన వజ్రపుకొత్తూరులో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. పేపర్ భద్రత వైఫల్యం, లీకేజీలు, పరీక్షల రద్దు వంటి కారణాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏళ్ల తరబడి కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. పదే పదే జరుగుతున్న ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు.
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఘటనలు రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా పటిష్టమైన చట్టాలు చేసి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


