నాడు కళకళ.. నేడు వెలవెల! | - | Sakshi
Sakshi News home page

నాడు కళకళ.. నేడు వెలవెల!

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

నాడు కళకళ.. నేడు వెలవెల! నిర్లక్ష్యం వల్లే.. బాగానే నడిపాం.. ప్రభుత్వం మారాక..

నరసన్నపేటలో అలంకారప్రాయంగా మహిళా మార్టు

పూర్తిగా పడిపోయిన అమ్మకాలు

గతంలో రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాల్లో చోట్టు

నేడు చివరి వరుసలో ఉన్న స్థానం

కార్యాచరణ లోపమే శాపం

ప్రత్యేక దృష్టి పెడతాం...

నరసన్నపేటలో మహిళా మార్టు ఈ దశకు రావడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఒక వైపు మహిళలను పారిశ్రామికులుగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పుకుంటూ మరో వైపు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా మార్టులను ఇలా నిర్వీర్యం చేస్తున్నా రు. చెప్పేది ఒకటి చేసేది మరొకటి. దీనికి నరసన్నపేట మహిళా మార్టే నిదర్శనం.

– జి.వి.రమణి, చల్లవానిపేట

గతంలో మహిళా మార్ట్‌ బా గా నడిపాం. చాలెంజ్‌గా తీసుకొని నిర్వహించాం. ఎప్పుడూ కొనుగోలుదారులతో కళకళలాడేది. నెలకు కనీసం రూ.30 లక్షలు అమ్మకాలు చేసేవారం. మంచి లాభాలు కూడా వచ్చాయి. మమ్మల్ని సెర్ప్‌ అధికారులు మెచ్చుకున్నారు. రాష్ట్రంలో నరసన్నపేట మహిళా మార్టు మోడల్‌ గా నిలిచింది. – చింతు శ్రీదేవి,

ఎంఎంఎస్‌ పూర్వపు అధ్యక్షురాలు

నరసన్నపేట :

హిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఏర్పాటైన మహిళా మార్టులు తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అలంకారప్రాయంగా మారాయి. నరసన్నపేటలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వెలుగు మహిళా మార్టు నిత్యం కొనుగోలుదారులతో కళకళలాడేది. వేలాది రూపాయల్లో వ్యాపారం జరిగేది. నేడు కనీస స్థాయిలో కూడా వ్యాపారం జరగడంలేదు. గతంలో పది మంది సిబ్బంది ఉండే వారు. నేడు ఒక్కరే ఉంటున్నారు. సరుకులు కూడా నిండుగా ఉండేవి. ఇప్పుడు సెల్ఫ్‌లు అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. దీనంతటికీ కారణం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

2022 డిసెంబర్‌ 14న ప్రారంభం..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబర్‌ 22న నరసన్నపేటలో మహిళా మార్టును అప్పటి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ప్రారంభించారు. డీఆర్‌డీఏ, సెర్ప్‌ అధికారులు ప్రతిష్టాత్మకంగా భావించి మార్ట్‌ను నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకు ఇక్కడ లభించేవి. రాష్టంలోనే నరసన్నపేట మహిళా మార్టు అమ్మకాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఎప్పుడూ ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే వరకూ రూ.3.94 కోట్లు మేర అమ్మకాలు జరిగాయి.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మహిళా మార్టు పూర్వ వైభవం తగ్గింది. రోజురోజుకూ అమ్మకాలు తగ్గుతూ వచ్చాయి. ఉన్న సరుకులు ఖాళీ చేశారు. కొన్నింటికి కాలపరిమితి అయిపోయిందని చెప్పి సిబ్బంది ఇళ్లకు తరలించేశారు. అనంతరం కొన్నాళ్లు మూతపడింది. స్థానికంగా వస్తున్న విమర్శలతో వెలుగు మహిళా మార్టుగా పేరు మార్చి ప్రస్తుత ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జనవరిలో ఆర్భాటంగా ప్రారంభించారు. ఆ నెలంతా బాగానే నడిచింది. ఆ తర్వాత అమ్మకాలు రోజురోజుకీ తగ్గుతూ వచ్చాయి. గడిచిన 10 రోజులుగా ఒక్క రూపాయి కూడా అమ్మకాలు చేయడం లేదు. ఇలా మహిళా మార్టును అలంకారప్రాయంగా వదిలేయడానికి డీఆర్‌డీఏ అధికారుల్లో సరైన కార్యాచరణ లోపమేనని తెలుస్తోంది. స్థానిక అధికారులు సరైన దృష్టి పెట్టకపోవడం.. ఎంఎంఎస్‌ సభ్యులు పట్టించుకోకపోవడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

మహిళా మార్టులో అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఎందుకు అమ్మకాలు పడిపోయాయో సమీక్ష చేస్తాను. మా వద్ద కొనుగోలుదారులు అధికంగా ఉన్నారు. స్వయం శక్తి సంఘాల సభ్యులు వచ్చి కొనుగోలు చేస్తే అమ్మకాలు వాటంతట అవే పెరుగుతాయి. అయితే మహిళలు ఇటు వైపు చూడటం లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి అమ్మకాలు పెరిగేలాచర్యలు తీసుకుంటాం.

– పి.కిరణ్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ

Advertisement
 
Advertisement
Advertisement