గార: కొర్ని గ్రామానికి చెందిన భీముని చిన్నబాబు కౌలుకి తీసుకొని సాగుచేస్తున్న మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. బుధవారం కొంత మొక్కజొన్న పంటను కోత కోసి పోగులు వేశారు. మిగిలిన పొలంలో చిన్న కుప్పలుగా వేసి ఉంచారు. గురువారం మంటలు వ్యాప్తి చెంది 70 సెంట్లలోని పంట అంతా కాలిపోయింది. కుప్పలుగా ఉన్న పొట్టలు సైతం కాలిపోవడంతో సుమారు రూ. 40 వేలు నష్టం వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పొలం మీదుగా వెళ్తున్న విద్యుత్ వైర్లు వల్ల గానీ, చుట్టుపక్కల ఎవరైనా కోతలు పూర్తయిన మొక్కలకు నిప్పు పెట్టడం వల్ల గానీ మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. వీఆర్‌వో సన్యాసి పంటను పరిశీలించారు.


