సాగునీటి కాలువపై పక్కా భవనం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కాలువపై పక్కా భవనం

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

పలాస: పలాస మొగిలిపాడు జాతీయ రహదారి పక్కన సాగునీటి కాలువపై పలాసకు చెందిన ఓ వ్యాపారి పక్కా భవనం నిర్మించాడు. మొగిలిపాడు బ్రిడ్జి పక్కన సర్వీస్‌ రోడ్డు ఉంది. బ్రిడ్జి కారణంగా ఆ రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. దాని పక్కనే ఆ వ్యాపారి వ్యాపార అవసరాల కోసం గొడౌన్‌ నిర్మాణం చేపట్టాడు. గొడౌన్‌కు వెళ్లాలంటే సాగునీటి కాలువ దాటి వెళ్లాలి. దీంతో ఆ కాలువ అడ్డంగా ఉందని కాంక్రీట్‌ వేసి కప్పేశాడు. పనిలో పనిగా జాతీయ రహదారిని కూడా కొంత ఆక్రమించాడు. జాతీయ రహదారి అధికారులు ఎన్నిసార్లు నోటీసు లు ఇచ్చినా ఆ వ్యాపారి పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement