గార: రామచంద్రాపురం పంచాయతీ సెగిడిపేట గ్రామానికి చెందిన కర్రి త్రినాథరావు (45) గురువా రం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. త్రినాథరావు ఒప్పంగిలోని మిల్లులో కలాసీగా పనిచేస్తున్నాడు. మూడు రోజులుగా పనికి వెళ్లకుండా రోజూ మద్యం తాగుతున్నాడు. తాగవద్ద ని భార్య మందలించడంతో గురువారం సాయంత్రం మళ్లీ మద్యం తాగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం శ్రీకాకు ళం రిమ్స్‌కు తరలించారు. భార్య రాంబాయి ఫిర్యా దు మేరకు హెచ్‌సీ రవిబాబు కేసు నమోదు చేశారు. త్రినాథరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పీఎం పాలెం (విశాఖ): భవన నిర్మాణ పనుల కోసం విశాఖ నగరానికి వచ్చిన ఓ తాపీ మేసీ్త్ర ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిన విషాద ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శ్రీకూర్మానికి చెందిన ఉంకుల రాము (47) క్రికెట్ స్టేడియం సమీపంలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. పగలు పని ముగించుకుని రాత్రి అదే భవనం నాలుగో అంతస్తులో తోటి కార్మికులతో కలిసి నిద్రించాడు. తెల్లవారుజామున రాము కనిపించకపోవడంతో తోటి వారు వెతకగా, భవనం ప్రహరీ అవతల శవమై కనిపించాడు. రాత్రి సమయంలో నిద్రమత్తులో భవనం అంచుకు వెళ్లినప్పుడు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కింద పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాముకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు యుగంధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.


